Sunday, April 28, 2024

రాజన్న సిరిసిల్లలో కలకలం.. మంత్రి కేటీఆరే న్యాయం చేయాలంటూ కుటుంబం నిరసన

రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ  కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో ఓ కుటుంబం నిరసన తెలుపుతోంది. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా కుటుంబ సభ్యులతో ప్లకార్డులు పట్టుకొని బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తన కుటుంబానికి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని కుటుంబమంత ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటమంటున్నామని బాధితులు చెబుతున్నారు.

తంగళ్లపల్లి మండలం పద్మనగర్ కు చెందిన సంతోష్ కుటుంబం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో నిరసన తెలుపుతున్నారు. కొందరు గ్రామంలో టీఆర్ఎస్ నేతలు స్థలాన్ని తనకు అమ్మరని ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తుండగా అదే టీఆర్ఎస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసి ఇంటికి పర్మిషన్ లేదంటూ జేసీబీతో కూల్చేయడంతో సంతోష్ కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆత్మహత్య యత్నానానికి పాల్పడ్డారు. విషయం బయటకు రాకుండా తంగళ్లపల్లి మండలం కొందరు ప్రజాప్రతినిధుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయలతో పాటు నివేశ స్థలాన్ని కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

ఒప్పందం జరిగి సంవత్సరమైన ఇంత వరకు న్యాయం జరగలేదని నివేశ స్థలాన్ని ఇవ్వకుండా చుట్టూ తిప్పించుకుంటు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. మంత్రి కేటీఆరే తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement