Wednesday, April 24, 2024

క్యాలీప్ల‌వ‌ర్ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన అల్ల‌రి న‌రేశ్..

క్యాలీ ప్ల‌వ‌ర్ ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ మేర‌కు ఈ చిత్రం నుండి లిరిక‌ల్ వీడియో సాంగ్ ని హీరో అల్ల‌రి న‌రేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు చిత్ర యూనిట్.. “కిల్ బిల్ కళాకార్ సంపూర్ణేషుడు .. జిల్ జిల్ జిగా జిగా మండే సూర్యుడు .. హల్ చల్ చేస్తున్నాడు ఈ ఆండ్రాయుడు .. క్రేజీ క్యాలీఫ్లవర్ నామధేయుడు” అంటూ ఈ పాట జోరుగా హుషారుగా సాగుతోంది. ప్రజ్వల్ క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా సాకేత్ ఆలపించాడు. ఈ పాటకి శశి మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఆశాజ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆర్కే మలినేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో హీరో సంపూర్ణేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement