Saturday, April 27, 2024

Gold : 3 రోజుల్లో రూ.1100 డౌన్..

బంగారం ధరలు క్ర‌మ‌క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. వరుసగా మూడో రోజు ధరలు పడిపోయాయి. తులం బంగారంపై ఏకంగా రూ.1100 మేర దిగివచ్చాయి. వెండి సైతం భారీగా పడిపోయింది.గత వారంలో వరుసపెట్టి పెరుగుతూ రికార్డు గరిష్ఠాలకు చేరి ఆందోళన కలిగించిన బంగారం ధరలు దీపావళి పండుగ ముందు దిగివస్తుండడం గమనార్హం.

ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ఏకంగా రూ.300 మేర తగ్గి ప్రస్తుతం రూ.56 వేల 400 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 320 తగ్గి ప్రస్తుతం రూ. 61 వేల 530 వద్దకు వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ. 77 వేల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement