Thursday, May 9, 2024

Rain :తెలంగాణ‌లో వ‌ర్షాలు… ఈ జిల్లాలోనే..

తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. బంగాళాకాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు.

వచ్చే ఆరు రోజుల్లో పలు చోట్ల వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ నెల మెుత్తం వరుణుడు ముఖం చాటేయగా.. ఈనెల మెుదటి వారంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించిందని.. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణ వైపు తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement