Thursday, December 7, 2023

నకిలీ రిపోర్టర్స్ అరెస్ట్

మెదక్ ప్రతినిధి: ప్రభ న్యూస్రై స్ మిల్లర్స్ యజమానులకు బెదిరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ జర్నలిస్టులపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా కు చెందిన ఐదుగురు నకిలీ జర్నలిస్టులు సిద్దిపేట నుంచి నార్సింగి లోని ఓ రైస్ మిల్ కు లారీలో వడ్లు తీసుకొస్తుండగా సంకాపూర్ సమీపంలో లారీని ఆపి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.విషయం తెలుసుకున్న స్థానిక రైస్ మిల్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

- Advertisement -
   

వీరు ఇటీవల చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ ,రామయంపేట వద్ద బియ్యం వాహనాలను ఆపి డబ్బులు తీసుకున్నారు.గతంలో కామారెడ్డి జిల్లా బిక్నూర్ టోల్ గెట్ వద్ద లారీ ని ఆపి రూ 3 లక్షలు డిమాండ్ చేశారు.దింతో అప్పట్లోనే వారిపై పోలీసులు బిక్ నూర్ పోలీసులు కేసు నమోదు నమోదైందని నార్సింగి ఎస్ఐ హైమద్ తెలిపారు

.కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన కుక్కల రాజు,మండ్ల రాజమౌళి బిక్ నూర్ మండలం రామేశ్వర పల్లి కి చెందిన దాసరి నాగరాజు,దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన వడ్ల రాజేందర్,కామారెడ్డి పట్టణంలోని శేరి గల్లీ వీధి కి చెందిన మ్యాడిపల్లి కిరణ్ కుమార్ లుగా గుర్తించామని ఎస్ఐ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement