Wednesday, October 2, 2024

మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేద్దాం – మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించనున్నరని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ మరియు ప్రవేటు కళాశాలల యాజమాన్యాలతో మెడికల్ కళాశాల ప్రారంబోత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రపంచానికి అన్నం పెట్టె రైతులనే కాదు వైద్యాన్ని నందించే డాక్టర్లను కూడ ఆందించగలదని నిరూపించేలా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే గగనంగా ఉండే తెలంగాణాలో మెడికల్ కళాశాల ఏర్పాటు అసంభవం అనట్లుగా ఉండేదని, రాబోయే రేపటి తరానికి ఆస్తిగా నిలిచే విద్యార్థుల కలను సాకారం చేస్తూ వారికి బంగారు భవిష్యత్తునందించే దిశగా రాష్ట్రంలోని జిల్లాలలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉన్న పేద విద్యార్థికి ఓ కలగా ఉండే వైద్యవిద్యను సాకారం చేసేలా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

ఈ సందర్బంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈనెల 15 ప్రారంభించ నున్నందున జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన దాదాపు 25వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులతో, ఎన్ సి సి, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ల విద్యార్థులతో రేకుర్తి నుండి మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వారి తల్లి తండ్రులు పాల్గోనేలా చూడాలన్నారు. అదే విధంగా విద్యార్థుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్ కు సూచించారు. విద్యార్థులను కళాశాల నుండి తీసుకురావడం నుండి కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి తీసుకువేళ్లే బాద్యత ఆయా కళాశాలలే తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, కలెక్టర్ డాః బి. గోపి, సిపి సుబ్బారాయుడు, చోప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టౌన్ ఎసిపి నరేందర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, డిఆర్డిఓ శ్రీలత, జిల్లా గ్రందాలయ సంస్థ చైర్మన్ పోన్నం అనీల్ కుమార్ గౌడ్ , మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, వివిధ కళాశాల యాజమాన్యాలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement