Sunday, May 5, 2024

TS: వివాహేతర సంబంధం… దాడిలో గాయపడిన సీఐ ఇప్తేకార్ అహ్మద్ మృతి…

మహబూబ్ నగర్ క్రైమ్, నవంబర్ 8 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీన్ఎస్) లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇస్తేకార్ అహ్మద్ హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడి మృతి చెందినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే సీఐ ఇప్తేకార్ అహ్మద్ మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆమె భర్త ఈ విషయం తెలిసి పలుమార్లు ఇరువురిని మందలించిన తీరు మార్చుకోకపోవడంతో ఈనెల 9వ తేదీన విచక్షణా రహితంగా సీఐపై దాడి చేసి తలపై గాయపరిచి ఆ తర్వాత సిఐ మర్మాంగాలను కోసేసి పరారయ్యాడు. పట్టణంలోని మర్లు, పాలకొండ రహదారిలో తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలై తన కారులో ఉండగా అది చూసి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన పట్టణంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.

ఎస్విఎస్ ఆస్పత్రి వైద్యులు ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో అక్కడి నుండి సిఐని హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన సీఐకి మెదడులో రక్తం గడ్డ కట్టింది. వైద్యులు ఆపరేషన్ చేసి చెడు రక్తాన్ని తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి సీఐ ఇఫ్తేకార్ అహ్మ‌ద్ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ పోలీస్ అధికారులు మృతదేహాన్ని శవ పంచనామా కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాక ఇస్తేకార్ అహ్మద్ కేసును హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న కానిస్టేబుల్ దంపతుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. కాగా ప్రధాన నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే సీఐపై దాడి మహిళా కానిస్టేబుల్ ఇంట్లో జరిగిందా ? కారులో జరిగిందా ? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement