Saturday, April 27, 2024

Exclusives – బిజెపిని క‌ల‌వ‌ర‌పెడుతున్న జంపింగ్ జ‌పాంగ్స్……

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :బీజేపీ అసంతృప్త నేతల వ్యవ హారం ఆ పార్టీకి మరోసారి తలనొప్పిగా మారింది. అసెంబ్లిd ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ బీజేపీని వీడేందు కు సిద్ధమవుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందని ముఖ్య నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండగా, మరో నేత, మాజీ ఎమ్మె ల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేం దుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు కూడా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ దే అధికారం అని భావిస్తున్న సోయం… హస్తం గూటికి చేరాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజు లుగా ఢిల్లిdలోని కాంగ్రెస్‌ పెద్దలతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీలోని ముఖ్య నేతలు, మా జీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఓ దశలో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు కూడా వాిరు సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం తమకు సరైన ప్రాధా న్య త ఇవ్వడం లేదన్న ఆరోపణలతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతి, అక్ర మా లను చూసిచూడనట్టుగా వ్యవహరి స్తో ందని, లిక్కర్‌ కేసులో కేసీఆర్‌ కూతురు, ఎమ్మె ల్సీ కవితపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ పరి ణామంతో రంగంలోకి దిగిన బీజేపీ అధి ష్టానం అసంతృప్త నేతలను బుగించి వారికి ఎన్నికల కమిటీల్లో కీలక బాధ్యతలను అప్ప గిం చింది. దీంతో కొద్ది రోజులుగా అసంతృప్త నేతల వ్యవహారం సద్ధి మణిగిందని రాష్ట్ర నాయకత్వం భావిం చింది. అనూహ్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జాబితాలు విడు దలైన తరు ణం లో ఒక్కొక్కరుగా బీజేపీలోని సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరుతుండడం బీజేపీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది.

టికెట్‌ ఖాయమైనా వీడేందుకే సిద్ధం..!
బీజేపీలో టికెట్లు ఖాయమైన తర్వాత కూడా నేతలు కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతుండడంతో బీజేపీ రాష్ట్రనాయ కత్వా నికి విస్మయానికి గురిచేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డికి నర్సంపేట టికెట్‌ దాదాపు ఖాయమైంది. రెండు రోజుల్లో విడుదల కానున్న బీజేపీ తొలివిడత అభ్య ర్థుల జాబితాలో రేవూరి ప్రకాష్‌రెడ్డి పే రు కూ డా ఉందని ప్రచారం జరుగు తోం ది. ఈ తరు ణంలో టికెట్‌ కన్‌ఫామ్‌ అయిన తర్వాత కూడా రేవూరి కాంగ్రెస్‌లోకి వెళుతుండడం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. మరోవైపు బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేం దర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ ఎమ్మె ల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కొద్దికాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, తీరా ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మా రింది. తాజాగా ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను సోయం బాపూ రావుకు ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఓ దశలో సోయంకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్క నుం దన్న ప్రచారం కూడా జరిగింది. సోయం బాపూరావును నమ్ముకున్న బీజేపీ… ఆదివాసీల ఓట్లపై గురిపెట్టింది. కొద్ది రో జుల క్రితమే ఆదిలాబాద్‌లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటించి బహిరంగసభలో పాల్గొ న్నారు.

ఆదివాసీల ఓట్లే లక్ష్యంగా ఆయన ప్రసంగం కొన సాగింది. అమిత్‌ షా ఇలా వెళ్లాడో లేదో అలా సోయం కాంగ్రెస్‌ అధి ష్టానం పెద్దలతో టచ్‌లోకి వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించుకుంది. రాబోయే అసెంబ్లిd, సార్వత్రిక ఎన్ని కల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి రానుం దని భావిస్తున్న సోయం… బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరా లను కుంటున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ నిరసనల కార్యక్రమాల కమిటీ- చైర్‌ పర్సన్‌, మాజీ ఎంపీ విజయశాంతి సొంత పార్టీ నేతలపైనే వరుస ట్వీట్లతో విమర్శలకు దిగుతుండడం కూడా ఎన్నికల వేళ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్‌ నేతగా ఇతర నేతలకు సర్దిచెప్పాల్సినవిజయశాంతే రకరకాల టీ-్వట్లు-తో పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరును విమర్శిస్తున్నారు. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను కమలదళం సరైన విధంగా విని యో గించుకోవడం లేదని గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు విజయశాంతి. తనను ఏ బహిరంగ సభలకు ఆహ్వానించడం లేదని.. ఆహ్వానించినా మాట్లాడనివ్వడం లేదనేది విజయ శాం తి ప్రధాన ఆరోపణ. దీనికితోడు కేసీఆర్‌ కుటు-ంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసు కోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో పార్టీ నాయకత్వం తీరును ఎండగట్టారు. ఒక దశలో రాజ గోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తది తర నేతలు పార్టీ వీడతారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీ పెద్దలు రంగంలోకి దిగి సీనియర్లు అందరికీ నచ్చ జెప్పడంతో కాస్త శాంతించారు. అయితే విజయశాంతి మాత్రం ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తూ అగ్గి రాజేస్తూనే ఉన్నా రు. విజ యశాంతి వ్యవహారం ఎటు దారితీస్తుందోనన్న చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement