Thursday, May 9, 2024

Congress Campaign – ఇక ప్రచారంతో హోరెత్తించనున్న కాంగ్రెస్…18న రామప్ప ఆలయం నుంచి రాహుల్ గాంధీ శంఖరావం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక వైపు చేరికలపైన దృష్టి పెడుతూనే.. మరో వైపు ఎన్నికల్లో ప్రచార వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులపై వేసే పనిలో నిమగ్నమైనాయి. కాంగ్రెస్‌ పార్టీ 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటించగా.. రెండో జాబితాపైన తీవ్ర కసరత్తే చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు రోజుల పర్యటనకు రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 18న నుంచి రామప్పదేవాయలం నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్రను రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. ముందుగా కొండగట్టు- నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్‌ షెడ్యూల్‌లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్‌ బస్సుయాత్రను ప్రారంభిస్తారు . నెల 18,19,20 తేదీల్లో ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కొనసాగే కాంగ్రెస్‌ బస్సుయాత్రలో పాల్గొంటారు. బస్సు యాత్రలో భాగంగానే.. పాదయాత్ర లతో పలువురు కార్మికులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. అనంతరం నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించడంతో పాటు ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్‌ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

ప్రతి రోజు మూడు నియోజక వర్గాల చొప్పున 12 రోజులపాటు- తెలంగాణలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ తరుణంలో తొలి విడతలో రాహుల్‌ మూడు రోజులపాటు- 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా.. దసరా తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభించనుంది. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరుకానున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఈ యాత్రకు సోనియా రంగంలోకి దించాలని భావిస్తోంది. సోనియాతో పాటు- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్ర సీఎంలు హాజరయ్యేలా టీ-పీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement