Sunday, May 19, 2024

అందరికీ విద్య.. అంద‌ని ద్రాక్షేనా

నేటి స‌మాజంలో ప్ర‌తిఒక్క‌రికి విద్యపై ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. ప్ర‌పంచ దేశాలు సైతం అక్ష‌ర జ్ఞానం లేకుంటే అభివృద్ధి శూన్య‌మ‌ని గ్ర‌హించాయి.అందుకే రాజ్యాంగం నిర్బంధ విద్య‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పాలకుల ఆలోచనలు.. దానికి తగ్గట్లుగా చేసిన చట్టాలు వినడానికి బాగున్నా అమలులో వైఫల్యం చెంద‌డం వ‌ల్ల అవన్నీ కాగితాలకే పరిమితవుతున్న విషయం తెలిసిందే.. 14 ఏళ్ల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని.. వారిని చదువులు మాన్పించి పనులు చేయించరాదని.. పక డ్బందీ చట్టాన్ని రూపొందించారు.. రకరకాల ఆర్థిక నేపధ్యాలతో నిరుపేదలు ఎక్కువగా ఉన్న మన దగ్గర దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు.. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా గల దేశాల వరుసలలో భారత్‌ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం 128వ స్థానంలో ఉండటం శోచనీయం.. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో అందరికీ విద్య కోసం అనేక పథకాలు వచ్చాయి.. ప్రభుత్వాలు, పాలకులు మారినప్పుడల్లా పథకాలు, పథకాల పేర్లు మాత్రమే మారాయి తప్పా.. అమలు మాత్రం కావడం లేదు.. ఫలితంగా ఏ భవన నిర్మాణ పనుల్లో చూసినా.. పరిశ్రమలు, క‌ర్మాగారాలు, ఇటుక బట్టీలు.. రోడ్డు పనులు ఇలా ఒకటేంటి హోటళ్లు, దుకాణాలు చివరకు గొర్రెల‌ కాపరులు ఇలా ఎక్కడ చూసినా 14 ఏళ్ల లోపు వారే దర్శనమిస్తున్నారు.. స్వర్ణోత్సవాలు జరుపుకున్న భారత్‌లో ఇప్పటికీ ఈ దృశ్యాలు చూడటం దురదృష్టకరం.. ప్రపంచమంతా అందరికీ విద్య కోసం అగ్రస్థానం కేటాయిస్తే మన దగ్గర కాగితాలకే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు సరైన పాఠశాలలు కూడా లేకుండాపోయాయి.. చెట్ల కింద చదువులు, ఎండాకాలం ఎండ, వానాకాలం వర్షం.. పుష్కలంగా పడే గదుల్లో విద్యార్ధుల చదువులు సాగుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ విద్య ఎలా సాధ్యమవుతుందో అర్ధం చేసుకోవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో భారత్‌ అక్షరాస్యతలో 74.4శాతంతో 128వ స్థానంలో ఉండటం ఇక్కడ అధిక నిరక్షరాస్యులున్నార నేందుకు నిదర్శనం.. ప్రపంచంలో ఫిన్‌లాండ్‌, గ్రీన్‌లాండ్‌, ఉజ్‌బేకిస్తాన్‌, అండోరా, కొరిమా నార్త్‌ దేశాలు అక్షరాస్యతలో వంద శాతం ఉండి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యల్పంగా నైగర్‌ దేశంలో 19.1 అక్షరాస్యత మాత్రమే ఉండటం గమనార్హం. మన దేశంలో అక్షరాస్యతలో కేరళ 94శాతంతో మొదటి స్థానంలో ఉండగా, లక్ష ద్వీప్‌ 91.85 శాతంతో రెండవస్థానంలో ఉంది. బీహార్‌లో అతి తక్కువగా 61.80 శాతం అక్షరాస్యత ఉంది.. తెలంగాణలో 66.54 శాతం అక్షరాస్యత ఉండగా, పురుషులు 69.49, మహిళలు 48.83 శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో 8325 శాతం అక్షరాస్యులుండగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 69.16 శాతం నమోదైంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చిన్నారుల బంగారు భవిష్యత్తు బుగ్గి పాలుకాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేప డితే రాబోయే కాలంలోనైనా అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement