Tuesday, April 30, 2024

ఓడిపోని కేసీఆర్ కు పీకే అవసరమేంటి? : ఈటల

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీని విమర్శించవద్దని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్… ఇప్పుడు అదే ప్రధానిపై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఓడిపోని కేసీఆర్ కు ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్థమైపోయాయని అందుకే పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

పీకే కన్నా పెద్ద మేధావులు తెలంగాణలో ఉన్నారని ఈటల పేర్కొన్నారు. దుబ్బాకలో, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఇంత చిల్లర వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రిగారూ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బస్తీల్లో కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ధాన్యం విషయంలో కేసీఆర్ ఇప్పటికే అభాసుపాలయ్యారని… ఇప్పుడు కూడా రజకులు, నాయీ బ్రాహ్మణులు, వ్యవసాయ మీటర్ల విషయంలో అభాసుపాలవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఒక గురువింద గింజ అని, ప్రధాని మోదీతో కేసీఆర్ కు పోలికేంటని ఈటల వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement