Saturday, May 4, 2024

ఆరోగ్యాన్ని ఆశ్రద్ద చెయ్యొద్దు… ఎంపీ రంజిత్ రెడ్డి

మొయినాబాద్ : ప్రస్తుతమున్న బిజీ లైఫ్ లో ప్రజలెవరూ కూడా ఆరోగ్యాన్ని అశ్రద్ద చెయ్యొద్దని, ఆరోగ్యం చాలా ముఖ్యమని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ మండలం, చిల్కూర్ గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథ సేవలను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న గడప గడపకు ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆరోగ్య చేవెళ్ల రథాన్ని ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ద చెయ్యొద్దని, నిత్యం పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని వివరించారు.

జిల్లాకో మెడికల్ కాలేజ్, రాష్ట్ర వ్యాప్తంగా 20 డయాగ్నొస్టిక్ సెంటర్ లు మంజూరు చేసిందని తెలిపారు. నేడు ప్రైవేట్ హాస్పిటళ్లలో చెయ్యని పరీక్షలు సర్కార్ హాస్పిటళ్లలో చేస్తున్నారని తెలిపారు. బీపీ, షుగర్ లు ఉన్న వారు నిత్యం అవసరమైన మాత్రలు వాడటంతో పాటు, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిల్కూర్ గ్రామ సర్పంచ్ స్వరూప అండ్రుస్, మొయినాబాద్ మండల ఎంపీపీ నక్షత్రం జీవంత్ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అనంతరెడ్డి, స్వప్న, శ్రీహరి యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్, మహేష్ యాదవ్, రాజు గౌడ్, రవుప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement