Friday, May 10, 2024

BRS fire – ఉచిత విద్యుత్ ర‌ద్దు చేయడమే కాంగ్రెస్ విధానం … మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి..

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ పాలసీయేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‎తో కలిసి హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీష్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వొద్దనే చర్చ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న అసలు విషయాన్ని వాళ్లు ముందే తొందరపడి బయటపెట్టారని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు అందుబాటులో ఉండొద్దని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి లభ్యత ఉన్నా ఇవ్వడం లేదని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. చత్తీస్ గఢ్ నుంచి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు తప్ప, అక్కడి ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ వద్దు అంటే ఆయన వెంట తిరుగుతున్న నాయకులు చప్పట్లు కొడుతున్నారని, ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పాలసీయేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానంపై రైతాంగం చర్చ జరపాలన్నారు.

- Advertisement -

తెలంగాణ చరిత్రను వక్రీకరించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

అమెరికాలో చంద్రబాబు అభిమానులు ఏర్పాటు చేసిన మీటింగులో మూడు గంటల కరెంట్ చాలంటూ ఆయన శిష్యునిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రైతులను తక్కువ చేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement