Saturday, May 4, 2024

పసివాళ్ళను.. పని వాళ్ళుగా మార్చకండి : నాగమల్లు

అన్ని దానాల్లో కెల్లా విద్యా దానం చాల గొప్పదని, నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో జే.డీ పౌండేషన్ చేస్తున్న సేవ వెలకట్టలేనిదని ఎల్బీనగర్ ట్రాఫిక్ సిఐ ఏ.నాగమల్లు తెలిపారు. ఈ మేరకు సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉన్న అక్షర జ్యోతి స్వచ్చంధ సంస్థ నిరుపేద, వీధి పిల్లల కోసం సాయంత్రం వేళ విద్యావంతులైన యువతీ యువకులు, పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 60 మంది చిన్నారులు పాల్గొంటున్నారు. వీరికి అవసరమైన మౌలిక వసతుల కోసం జేడీ ఫౌండేషన్ భద్రాచలంను సంప్రదించగా జేడీ ఫౌండేషన్ అక్షర జ్ఞానం పేరుతో చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా జె.డి పౌండేషన్ భద్రాచలం కన్వీనర్ మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ… హైదరాబాదులోని ప్రిస్టేజ్ పార్క్ స్పోర్ట్స్ క్ల‌బ్ శ‌ర‌వ‌న‌న్‌, ప్రభాక‌ర‌న్ లు నోట్ బుక్స్, స్టేషనరీ, ఫ్యాన్ లు,ట్యూబ్ లైట్స్,బోర్డ్స్ అందించగా మరో సంస్థ ఎక్స్ట్రామైల్ నాగ మోహన్ శిక్షణ అందించే వారికి కుర్చీలు, బల్లలు, పిల్లలకు మాట్స్, స్వీట్స్ అందించారని, సుధారాణి, డి. శ్రీకాంత్, సత్యమూర్తిలు పలకలు, బాగ్స్ అందించారని తెలిపారు. నాగమల్లు, శరవణన్, ప్రభాకరన్ లు ప్రత్యక్షంగా పాల్గొని పిల్లలకు అందజేశారు. ఎక్కడో భద్రాచలంలో ఉండి కూడా పసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేయూతనందించినందుకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చందు బాలబాలికల తల్లిదండ్రులు జేడీ. ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ హైదరాబాద్ సభ్యులు విశాల్, రామాంజనేయులు, మధు, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement