Monday, May 6, 2024

చిరు ధాన్యాల ఆహారంతోనే దీర్ఘాయుష్షు: వైద్య నిపుణులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పూర్తి ఆరోగ్యంతో పది కాలాలపాటు బతకాలంటే చిరు ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ప్రధానంగా భుజించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలను చిరు ధాన్యా లు లేదా తృణ ధాన్యాలు అంటారు. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని , తద్వారా మనిషికి వచ్చే వివిధ రకాల రోగాలు దరిచేరవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

బేకరీల్లో,ఫుడ్‌ కోర్టుల్లో ఆకర్షణీయ రంగుల్లో, గుమగుమలతో నోరూరించే వంటకన్నా మన సాంప్రదాయ చిరుధాన్యాల్లోనే అత్యధిక పోషక విలువలు ఉన్నాయని చెబుతున్నారు. రిఫైండ్‌, పాలిష్‌ చేసిన (వరి, మొక్కజొన్న) ఆహారధాన్యాలతో తయారు చేసిన వంటకాల్లో శరీరానికి, ఆరోగ్యానికి కీలకమైన జింక్‌, ఐరన్‌ విటమిన్లు లోపిస్తున్నాయి. ఈ సమస్యకు తగిన పరి స్కారం… రోజువారీ ఆహా రంలో చిరుధాన్యాలను తీసుకుంటే చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చిరు ధాన్యాలు (జొన్న, రాగి, సజ్జ, కొర్ర, సామ తదితర) ను రోజువారీ ఆహారంలో తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందని , రక్తంలో హీమో గ్లోబిన్‌ పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. వరుసగా రెండేళ్లపాటు చిరు ధాన్యాలను ఆహారం తీసుకున్నవారి రక్తంలో అవితీసుకోని వారి రక్తంలో కంటే దాదాపు 15శాతం అధికంగా హిమోగ్లోబిన్‌ ఉన్నట్లు ఇటీవల ప్రముఖ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఇక్రిసాట్‌ నిర్వహిం చిన అధ్య యనంలోనూ తేలింది.

సాధారణంగా చిరుధాన్యాలను తీసుకోవడం కంటే మొలకెత్తించిన చిరు ధాన్యాలతో శరీరంలో ఐరన్‌ పాళ్లు మూడింతలు అధికంగా పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రంలో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 15-50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు గర్భిణుల్లో 42శాతం , సాధారణ మహిళల్లో 30శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేల్చింది. అయిదేళ్లలోపు చిన్నారుల్లో 48శాతం మందిలో రక్తహీనత ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement