Saturday, January 22, 2022

మంత్రి కేటీఆర్ ను కలిసిన డీఎంకే ఎంపీలు

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ ర‌ద్దు కోరుతూ పలు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆ లేఖను ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ ను అందించిన డీఎంకే ఎంపీలు.. తాజాగా తెలంగాణ సీఎంకు ఇచ్చారు. బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు క‌లిశారు. నీట్‌పై సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ‌ను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీర‌స్వామి క‌లిసి కేటీఆర్‌కు అంద‌జేశారు. కేంద్ర విధానాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ ప‌ట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తమిళ ఎంపీలు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు అమిత్ షా ?.. కేసీఆర్ సభకు చెక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News