Thursday, April 25, 2024

హుజురాబాద్ కు అమిత్ షా ?.. కేసీఆర్ సభకు చెక్!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నెల 30న బై పోల్ జరగనుంది. ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలోదూసుకుపోతున్నారు. ఉప ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట్ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్ర‌చారం చేస్తోంది. మంత్రి హ‌రీష్‌రావు అన్నీ తానై ప్ర‌చారం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్న‌ది.

అటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్ర‌చారం చేస్తోంది. పార్టీ కీలక నేపథ్యలో హుజురాబాద్ లో మకాం వేశారు. దుబ్బాక ఫలితమే మళ్లీ రిపీట్ చేయాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అగ్ర నేతలను రంగంలో దింపాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోశాఖ మంత్రి అమిత్‌ షా సభతో ఈ ప్రచారాన్ని ముగించాలని భావిస్తోంది. అయితే వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్‌కు వెలుప‌ల స‌భ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్‌లు ప్లాన్ చేస్తున్నాయి. అమిత్ షా సభను విజయవంతం చేసేలా కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది.

ఇది కూడా చదవండి:  హుజురాబాద్ ఉపఎన్నిక: నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే తుది గడువు

Advertisement

తాజా వార్తలు

Advertisement