Tuesday, May 7, 2024

Bhatti Vikramarka మంత్రిత్వ శాఖల బాధ్య‌త‌లు స్వీకరించిన డిప్యూటీ సీఎం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇందన, ప్రణాళిక శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.


బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎంకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్ కోస్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరితలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు.

మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలు పై మూడో సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement