Thursday, May 2, 2024

గ్యాంబ్లర్‌!…థాయ్‌లో అడ్డంగా బుక్కయిన చిట్టి

గ్యాంబ్లింగ్‌, జూదం ఆడుతూ పటాయాలో అరెస్టు..
దేవేందర్‌రెడ్డి అరెస్టు వార్తలపై జిల్లాలో చర్చోపచర్చలు
థాయ్‌ చట్టాల ప్రకారం కఠిన శిక్ష పడే చాన్స్‌..
నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
ఆ తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం
గతంలోనూ క్యాసినో అభియోగం, ఈడీ దాడులనుంచి రిలీఫ్‌

థాయ్‌లాండ్‌ పోలీసులు పటాయాలలోని ఓ క్యాసినోపై జరిపిన దాడుల్లో మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి ఉన్నట్లు- తెలుస్తోంది. గజ్వేల్‌ నియోజకవర్గం కొండపాక మండలంలో టీ-ఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుడిగా దేవేందర్‌ రెడ్డి ఎదిగారు. అయితే ఇంతకుముందే చీకోటి ప్రవీణ్‌తో బిజినెస్‌ వ్యవహారాలు నడిపినట్టు- ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కొంతకాలం క్రితం ఈడీ దాడుల నుంచి బయటపడ్డారు. కాగా, ఇప్పుడు గ్యాంబ్లింగ్‌, జూదం ఆడుతూ పటాయాలో క్యాసినోపై థాయ్‌ పోలీసులు జరిపిన దాడుల్లో దేవేందర్‌ రెడ్డి అరెస్టు అయినట్లు- వస్తున్న వార్తలు జిల్లాలో సంచలనం రేపాయి.


(ప్రభన్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌) – సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కేంద్రంలో సాధారణ రైతు కుటు-ంబంలో జన్మించిన చిట్టి దేవేందర్‌ రెడ్డి ఎక్స్‌ ప్లోజివ్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. 2008లో దొమ్మాట నియోజకవర్గంలో జరిగిన మద్యంతర ఎన్నికలతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గ పునర్విభజనలో కొండపాక మండలం గజ్వేల్‌ నియోజకవర్గంలో చేరడంతో అప్పటి డీసీసీబీ చైర్మన్‌ తూముకుంట నర్సారెడ్డి ప్రధాన అనుచరుడిగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో కొండపాక మండల వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు.

కాంగ్రెస్‌లో కీలక నేతగా..
2012లో జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో కొండపాక కేంద్రం నుండి చైర్మన్‌గా ఘనవిజయం సాధించారు. అనంతరం ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తూముకుంట నర్సారెడ్డికి మద్దతుగా నిలిచి, కొండపాక మండలంలో జెడ్పీటీ-సీగా తన సతీమణి చిట్టి మాధురిని గెలిపించుకున్నారు. కొండపాక మండల ఎంపీపీ స్థానాన్ని కూడా తన ప్రధాన అనుచరుడికి కట్టబెట్టి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటు-కున్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరి, డీసీసీబీ చైర్మన్‌గా..
2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం మంత్రి హరీశ్రావుతో అప్పటి టీ-ఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన దేవేందర్‌ రెడ్డి అప్పటి డీసీసీబీ చైర్మన్‌ జైపాల్‌ రెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టి విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సైతం టీ-ఆర్‌ఎస్‌ పార్టీ నుండి క్రియాశీల పాత్ర పోషించి సీఎం కేసీఆర్‌ రెండోసారి ఘనవిజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించినట్టు- తెలుస్తోంది.

- Advertisement -

చికోటి ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలు, ఈడీ దాడులు..
2020లో జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా చైర్మన్గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇట్లా రాజకీయంగా అంచెలంచలుగా ఎదిగిన దేవేందర్‌ రెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీ-ఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీల నాయకుడిగా మారారు. ఇదే తరుణంలో చీకోటి ప్రవీణ్‌ ఎదుర్కొన్న క్యాసినో అభియోగంలో చిట్టి దేవేందర్‌ రెడ్డితో పాటు- మరికొంతమందిపై ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈడీ దాడుల నుండి బయటపడ్డ దేవేందర్‌ రెడ్డి ప్రస్తుతం పటాయాలో థాయిలాండ్‌ పోలీసులు గేమింగ్‌ యాక్ట్‌ లో అరెస్ట్‌ చేసినట్లు- వస్తున్న వార్తలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. పటాయిలో సుమారు 90మంది జూదం ఆడుతున్నారన్న అభియోగంలో 83 మంది భారతీయులు అరెస్ట్‌ కావడం, అందులో మెదక్‌ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి ఉన్నట్లు- వార్తలు రావడం ఇక్కడ సంచలనంగా మారింది.

నేడు థాయ్‌ పోలీసుల ప్రెస్‌మీట్‌..
గ్యాంబ్లింగ్‌, జూదం ఆడుతూ పట్టుబడ్డ ఇండియన్‌ పౌరులు థాయ్‌ చట్టాల గురించి తమకు తెలియదని చెబుతున్నట్టు సమాచారం. అయితే.. సోమవారం మేడే సందర్భంగా కోర్టులకు సెలవు రావడంతో నిందితులను మంగళవారం థాయ్‌లాండ్‌ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, కేసు పూర్వాపరాలను పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గ్యాంబ్లింగ్‌ ఆడుతూ పట్టుబడ్డ 90 మంది భారతీయులు..
థాయ్‌లాండ్‌లో ఇండియన్‌ గ్యాంబ్లింగ్‌ ముఠా పట్టుబడింది. పటాయలో 90మందిని అరెస్టు చేయగా అందులో 83 మంది భారతీయులున్నారు. కాగా, వీరిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అరెస్టు అయినవారిలో 14 మంది మహిళలున్నారు. వారి నుంచి భారీగా నగదు, గేమింగ్‌ చిప్స్‌ని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీకోటి ప్రవీణ్‌ ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్‌ జరుగుతున్నట్లు- ఆరోణలున్నాయి.

పోలీసుల అదుపులో ఉన్నదెవరు?
గ్యాంబ్లింగ్‌ ఆడుతూ పట్టుబడ్డ వారిలో థాయ్‌ పోలీసుల అదుపులో ఉన్నదెవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. అందులో చికోటి ప్రవీణ్‌, దాసరి మాధవ్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన చిట్టి దేవేందర్‌రెడ్డి, దాసరి రాజశేఖర్‌రెడ్డి, సుదర్శన్‌, మోహన్‌కుమార్‌, కాసం వసంత, మదన్‌ మాలిక్‌, అప్పలరాజు హరి, జి. భరత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

అనుబంధ వార్త …. కాసినో కింగ్ చికోటి థాయ్ ల్యాండ్ లో గ్యాబ్లింగ్…అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement