Friday, April 19, 2024

కొత్త‌గా 3,325క‌రోనా కేసులు.. 17మంది మృతి

త‌గ్గుముఖం ప‌డుతున్నాయి క‌రోనా కేసులు.. గత కొన్ని రోజులుగా 10 వేలకు చేరువలో నమోదైన కేసులు.. ఇప్పుడు 5 వేలకు లోపే వెలుగు చూస్తున్నాయి.ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.10 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,68,613) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,45,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,325 పాజిటివ్‌ కేసులు (Positive Cases) బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,52,996కి చేరింది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 47,246 నుంచి 44,175కు దిగొచ్చింది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,77,257గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,564 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement