Sunday, April 28, 2024

Dare Devils – దొంగలను దంచికొట్టిన త‌ల్లీకూతుళ్లు … స‌త్క‌రించిన డిసిపి

తుపాకీ, కత్తి లాక్కొని ఇరగదీశారు
వెంటపడి మరీ తరిమికొట్టారు
సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు
శభాష్​ అంటున్న పోలీసులు
నిందితులిద్దరూ అరెస్టు


ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లో చొరబడి తల్లీకూతుర్లను తుపాకీ, కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జైన్‌నగర్‌లో కలకలం సృష్టించింది. స్థానికులు, బేగంపేట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్‌ జైన్‌ నగర్‌లో ఉంటున్న అమితామెహాల్‌ ఇంట్లోకి గురువారం రాత్రి ఒకరు హెల్మెట్‌, మరొకరు టోపీ, మాస్కు ధరించి కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న తల్లీకూతుర్లను బెదిరించి దాడి చేసి చోరీకి యత్నించారు.

ఇద్దరు నిందితుల అరెస్టు..

ఆ తల్లీకూతుర్లు దుండగులను ఎదిరించి తుపాకీ, కత్తి లాక్కున్నారు. వారితో బీభత్సంగా పోరాడారు. తల్లీకూతుర్ల దాడిని తట్టుకోలేక ఆ ఇద్దరు అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుల ఇద్దరినీ అరెస్టు చేశారు. నిందితులు తెలిసిన వారా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

త‌ల్లీ కుమార్తెల‌కు పోలీసుల స‌త్కారం …

మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న త‌ల్లికుమార్తెల పోరాట పటిమ అభినందనీయమ‌ని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. వారి నివాసానికి వెళ్లిన డిసిపి త‌ల్లి కుమార్తెలు స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, దొంగలను పట్టుకునేందుకు అమిత్ మహోత్, ఆమె మైనర్ కూతురు చేసిన కృషి ఇత‌రుల‌కు స్ఫూర్తినిచ్చేదిగా ఉంద‌ని అన్నారు. పదకొండేళ్ల సర్వీసులో ఇంత ధైర్యం చూపిన మహిళలను చూడలేద‌న్నారు డిసిపి . ఇక్కడ ఒక నిందితుడు పట్టుబడగా, . మరో నిందితుడిని కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నార‌ని వెల్ల‌డించారు. . ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. గతంలో ఏమైనా కేసులు ఉంటే దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళలు కూడా ఆత్మరక్షణ నేర్చుకోవాలని డీసీపీ రోహిణి ప్రియదర్శిని పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement