Sunday, April 28, 2024

WGL: ప్రజలకు అందుబాటులో సైబర్ ఠాణా.. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్

వరంగల్ : సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవల కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగంతో పాటు అదే స్థాయిలో సైబర్ నేరాలపై అదే రీతిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది దృష్టిలో వుంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ భవన ప్రాంగణంలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అవసమైన మౌళిక సదుపాయల ఏర్పాటుతో పాటు, అధికారులు, సిబ్బంది కేబిన్లు, సైబర్ ల్యాబ్ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో చర్చించ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ద్వారా సైబర్ బాధితులకు వేగంగా సహకారాన్ని అందజేయడంతో పాటు, సైబర్ కేసులు నమోదు చేయడం, దర్యాప్తు, నేరస్తుల అరెస్టు చేపడుతారన్నారు. ఇందులో ఒక ఏసీపీ, ఒక ఇన్స్ స్పెక్టర్, ముగ్గురు ఎస్.ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్ళు, పన్నెండు మంది కానిస్టేబుళ్ళు ఈ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తారన్నారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం అవసరమైన వనరుల రాష్ట్ర పోలీస్ డిజిపి అంజనీకుమార్ ప్రత్యేక చర్యలు గైకొనడం జరుగుతోందని, ఇకపై సైబర్ బాధితులు సామాజిక మాద్యమాలైన twitter/TSCyberBureau, facebook/TSCyberBureau/, instagram/tscyberbureau/ ద్వారా గాని https://wa.me/918712672222 లింక్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీలు విజయ్ కుమార్, జనార్థన్ రెడ్డి, నాగయ్య, అనంతయ్య, ఇన్స్ స్పెక్టర్లు లక్ష్మీ నారాయణ, సంతోష్, ఆర్.ఐ శ్రీధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement