Wednesday, May 15, 2024

కర్మలకు సాక్షులు పంచభూతాలే!

భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఇతోధికమైన ప్రాధాన్యత సంతరించు కుంది. ఎందుకంటే, వివాహం పంచభూతాల సాక్షిగానే నిర్వహస్తూ ఉంటారు. వివాహం సమయంలో నూతన వధూవరుల చేత చేయించే సంకల్పంలో విశ్వరూపా న్ని, ఖగోళ స్థితిని, పంచభూతాల వివరాలు మంత్రపూర్వకంగా పురోహతులు చెబుతారు. భార్యాభర్తల అనుబంధం ముందు తరాల వారికి పునాది. ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థాలు మానవుడి లక్ష్యం. అందులో ”కామం” అనే పురుషార్థం ధర్మంగా సాగేటందుకే వివాహ వ్యవస్థ సృష్టించబడింది. భార్య (స్త్రీ) లేకుండా ఏ యజ్ఞ యాగాలు, వ్రతాలు వంటివి చేయడానికి అర్హతలేదు అని వేదాలు, పురాణాలు వివరిస్తున్నాయి. భార్య స్థానాన్ని శకుంతల, దుష్యంత మహారాజుకు వివరించిన సంఘటన తెలుసుకుందాం.
పురూ వంశానికి చెందిన మహారాజు దుష్యంతుడు వేటాడడానికి అడవికి వచ్చి, తిరిగి వెడుతూంటే గంగానదీ తీరంలో కన్నుల పండుగగా ఉన్న కణ్వమహర్షి ఆశ్రమాన్ని చూసి, దగ్గరగా రాగా చెవులకు ఇంపు అయిన సామవేదాన్ని స్వరంగా ఆలాపిస్తుంటే, ఆసక్తి పొంది, కదలకుండా వైరుధ్యం కలిగిన అడవి జంతువులు అన్నీ స్నేహ ప్రవృత్తితో సంచరించడం చూసి, ఎంతగానో ఆశ్చర్యపడి, తన పరివారాన్ని కొంచెం దూరంలో ఉంచి, తాను ఆశ్రమం లోకి ప్రవేశించగానే సన్నని మేను కలది, తామర రేకుల వంటి కన్నులు కలది, ఒత్తుగా గుమి గూడిన తుమ్మెదల వలె నల్లగా వంకర్లు తిరిగిన ముంగురులు కలది అయిన శకుంతలను చూసి, సంభాషించి, మహర్షి వివరం అడిగాడు. ఆమె మహారాజు కదా అని ఆసనం, అర్ఘ్యం, పాద్యం, మొదలైన అతిథి మర్యాదలు చేసింది. పండ్లు, తేనె తేవడానికి తన తండ్రి కణ్వ మహర్షి వెళ్ళాడని చెప్పింది. దుష్యంత మహారాజు ఆమె వివరాలు తెలుసుకొని, ”స్త్రీలకు తల్లిదండ్రులుగాక అన్నంపెట్టిన వారిని, భయం నుండి రక్షించిన వారిని, వేదాలు, జ్ఞానోపదే శం చేసిన వారిని, వీరిని తండ్రులుగానే పరిగణిస్తారు. నీ అందమైన రూపం, నీ మేను ప్రకా శం, ఈ నారచీరలు కొట్టుకోవడం, అడవి ఫలాలు, దుంపలు తింటూ ఉండడం, ఈ పర్ణశా లలో నీ వంటి అందమైన స్త్రీ నివసించడానికి తగినవి కావు. ఓ శకుంతలా! మిక్కిలి ప్రేమతో నిన్ను చూసుకొనే నాకు భార్యవు కమ్ము. రాజ్య సంపద, సేవకులతో అనుభవించవచ్చును.” అన్నాడు.
శకుంతల తన తండ్రి కణ్వమహర్షి వచ్చేవరకు ఆగమని చెబుతుంది. అయినా ఎంతో నేర్పుగా ”పంచభూతాల సాక్షిగా నేను నిన్ను గాంధర్వ వివాహం (మంత్ర రహతంగా) చేసు కొంటున్నాను.” అని ఆమెను ఒప్పించి, వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు.
ఆమె ”మహారాజా! నీ అనుగ్ర#హం వలన కలిగిన పుత్రుడు ఈ సువిశాల సామ్రాజ్యానికి యువరాజుగా దయతో, ప్రీతితో నిండు మనస్సుతో ఇవ్వండి. ఈ షరతుకు అంగీకరిస్తేనే మన వివాహం అవుతుంది” అంటుంది.
దుష్యంతుడు దానికి అంగీకరించి, ఇష్టసుఖాలు అనుభవించి, ”నిన్ను వెంట పెట్టుకొని రావడానికి మంత్రులను, సేవకులను కణ్వమహర్షి వద్దకు పంపుతాను” అని చెప్పి, వెళ్ళిపో యాడు. కణ్వమహర్షి వచ్చిన తదుపరి విషయం తెలుసుకొన్నాడు. తర్వాత కొంతకాలానికి, శకుంతలకు భగవంతుడు పుత్రుని ప్రసాదించాడు. ఆ కుర్రవాడు పేరు భరతుడు. పెరిగి పెద్ద వాడు అవుతున్నా, రాజు కాని, తన పరివారం కాని జాడలేదు. ఒకరోజు కణ్వమహర్షి శకుంత లను సమీపించి ”అమ్మా! ఎటువంటి పతివ్రతకైనా పుట్టిన ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. ఇల్లాలు భర్త దగ్గర ఉండడమే ధర్మం. భార్యలకు భర్తలే సర్వ రక్షకులు సుమా!” అని హతవు చెప్పి, పరిచారికలతో దుష్యంత మహారాజు వద్దకు పంపారు.
శకుంతల రాజు వద్దకు వచ్చేసరికి, సామంతులు, మంత్రులు, పురోహతులు, పురజను లతో నిండిన సభ జరుగుతోంది. దుష్యంతుడు ఆమెను చూసినా చూడనట్టే ఊరుకుంటాడు. అది గమనించిన శకుంతల ఆశ్రమంలో కలిసినప్పుడు చూపిన వలపును, ఆదరణను, దయను, ఆసక్తిని కనపరచకపోవడంతో ”నన్ను గుర్తించలేదా? గుర్తించినట్లు నటిస్తున్నా డా? చాలాకాలం అయినందుకు మరిచాడా?” అనుకుని, తేరుకుని ”ఓ! రాజా! వేట అనే మిష తో, కావాలని కణ్వమహర్షి ఆశ్రమానికి వచ్చి, సంతోషంగా నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాప కం చేసుకో! సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ బాలుడు నీ పుత్రుడు. పౌర వంశానికి అలంకా రమైన వాడు. ఉత్తమ గుణాలు కలవాడు. యువరాజుగా అభిషేకించు.” అంటుంది.
ఆమె మాటలకు, దుష్యంతుడు ఏమీ తెలియని వానిలా ”ఓ! పద్మముఖీ! నిన్ను నేను ఎరుగను. అసలు నీవు ఎవరివి? ఎక్కడి నుండి వచ్చావు? ఒప్పని మాటల వల్ల ప్రయోజనం లేదు. తిరిగి వెళ్ళిపో!” అనగానే, శకుంతల, తెల్లబోయి, కళ్ళనుండి వస్తున్న బిందువులను తుడుచుకుంటూ, ”రాజా! నాకు తెలియదు అని ఒక్కమాట బాగా మాట్లాడావు. ఈ సభ లోని పురుషోత్తములకు మన గాంధర్వ వివాహం సంగతి తెలియదని, సాక్షులు ఎవరూ లేర ని, అసత్యమాడవచ్చునా? అందునా ఒక మహారాజు వై ఉండి? ఓ! దుష్యంత మహారాజా! వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, హృదయం, యముడు, సూర్యచం ద్రులు, పగలు రాత్రి అనే మహా విషయాలు మన నడవడికను గమనిస్తూనే ఉంటాయి.
ఇవన్నీ సాక్షీ భూతాలే సుమా! అటువంటి సందర్భంలోమనిషి సత్యాన్ని దాచగలడా? మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు-నాకు తెలుసున్నట్లే, వీటిన్నింటికి తెలుసు.
బుద్ధితో బాగా పరిశీలిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి, అయిన భార్యను తిరస్కార భావంతో చూస్తే, దుర్బుద్ధితో వ్యవహరించే భర్తకు ఇహ పర సౌఖ్యాలు ఉండవు. యజ్ఞ యాగాలు, వ్రతాలు చేయాలంటే భార్యా సమేతంగా చేస్తేనే ఫలితం పొందుతామన్న విషయం నీకు తెలుసు కదా. ఏ కర్మ చేయాలన్నా భార్య సహకారం ఉండవ లసిందే. మీ వంశాభివృద్ధికి పుత్రులను పొందుతావు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఆపదల్లోనైనా, చుట్టుముట్టిన దు:ఖాన్ని నివారించడానికి, భర్తకు ఊరట, సౌఖ్యాన్ని కలిగించేది భార్య ఒక్కటే సుమా.
గృహస్థాశ్రమంలో రక్షణ కలిగించే శక్తి భార్యయే! భర్త కోసం సర్వస్వం త్యాగం చేసే త్యాగశీలి భార్య. రాజా! పుత్రుడి పరిష్వంగంలో తండ్రి మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు. ఇతడి జన్మకు కారణభూతులమైన మన ఇరువురం, ఇతని భవిష్యత్తుకు మనమే ఆధారం.
ఉత్తమ ధర్మ రాజా! మన వివాహం రోజు నీవు నాకు ఇచ్చిన వరం ” సత్యం” నిలిచి ఉం డగా, ఇతనని తిరస్కరించడం సబబు కాదు. ఒక త్రాసులో బాహాటంగా వేయి అశ్వమేథ యాగ ఫలాన్ని ఒక ప్రక్క, ”సత్యాన్ని” మరొక ప్రక్క ఉంచితే సత్యం వైపే మొగ్గు చూపి, సత్య మే గొప్పదని ఋజువు చేస్తుంది.
”సత్యమేవోశ్వరో లోకే! సత్యే ధర్మ: ప్రతిష్టత:!
సత్యమూలని సర్వాణి, సత్యాన్నాస్తి పరం పదం!!
అన్న పురాణోక్తి నీకు తెలియనిది కాదు. కాబట్టి నిర్మలమైన మనసుతో ఆలోచించి, మ మ్ము స్వీకరించు” అని చెప్పింది.
అపుడు ”నువ్వు ఎక్కడ? నేనెక్కడ! ఇంతకు పూర్వం నేను నిన్ను చూసి ఉండలేదు. అస త్యం చెప్పి రాజు పొందు కోరడం ధర్మం కాదు. తిరిగి నీవు వెళ్ళి పో!” అనగానే, మనసులో బాధపడుతూ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో ”ఈ భరతుడు నీ పుత్రుడు. ఈ ఇల్లాలు నీ భార్య. ఉత్తమ కీర్తి కలది. మహాపతివ్రత. మంచి వివే కంతో చెప్పింది.” అని ఆకాశవాణి పలికే సరికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న దుష్యంతుడు సభలోనే ”మీకు ఎవరికీ తెలియదని, లోక నిందకు గురికావ లసి వస్తుందని అసత్యం చెప్పాను. క్షమించండి” అని భార్య శకుంతలను, పుత్రుడు భరతు డుని స్వీకరించాడు.
మనం చేసే ప్రతీ కర్మకు సాక్షులు పంచభూతాలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement