Tuesday, April 30, 2024

RAID: అర్ధ‌రాత్రి ప‌బ్బుల్లో మోత‌… 40ప‌బ్బుల‌పై కేసులు న‌మోదు

హైదరాబాద్‌లో పలు పబ్బులపై పోలీసులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ లోని పబ్స్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై కొరడా ఝులిపించారు.

అర్ధరాత్రి వరకు పబ్బుల్లో గానా బజానాలతో హోరెత్తిస్తున్నారు. అర్ధరాత్రి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా భారీ శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ మేరకు ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు పలు పబ్బులలో తనిఖీలు చేపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించని క్లబ్ రోగ్, షర్ట్ పబ్, హలో కాక్టెయిల్, ఫ్యాట్ పీజియన్, జీరో 40 పబ్లపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు నమోదైన పబ్బులపై మరోసారి ఫిర్యాదులు వస్తే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement