Tuesday, May 14, 2024

TS : జ‌ల మండ‌లిలో అవినీతి జ‌ల‌గ‌లు …

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జలమండలి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్‌ సీజీఎం కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఫైనాన్స్‌ ఎల్‌.రాకేష్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌ను అరెస్టు చేశారు.

అక్బర్‌ హుస్సేన్‌ జలమండలికి నీటి ట్యాంకర్‌ అద్దెకిచ్చారు. అందుకు సంబంధించి కొన్నాళ్లుగా బిల్లులు రాకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్‌ రాకేష్‌ను సంప్రదించాడు. బిల్లులతో పాటు అద్దె రెన్యువల్‌ చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని రాకేష్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో అక్బర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ మేరకు లంచం డబ్బులను అక్బర్‌ హుస్సేన్‌ తొలుత అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌కు అందించాడు. తర్వాత ఆ మొత్తాన్ని రాకేష్‌ తీసుకొంటుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement