Sunday, April 28, 2024

CM REVANTH: ల‌క్ష‌లాది కోట్లు మేసేసి ఇసుక‌తో కాళేశ్వ‌రం నిర్మాణం – కేసిఆర్ పై రేవంత్ నిప్పులు…

ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ను ఇసుక‌తో నిర్మించారంటూ బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం పై సిఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు… నేటి ఉద‌యం ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ, మొదట ఉన్న రూ.38,500 కోట్ల నుంచి రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారని తెలిపారు.

అలాగే డ్యామ్ లో పిల్లర్లు పగుల్లు వచ్చి కుంగిపోతే.. దానిని బీఆర్ఎస్ నేతలు.. ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అలాగే కాళేశ్వరంను ఇసుకలో పేక మేడల్లగా కట్టారా అని కెసిర్ ను సీఎం సభలో నిల‌దీశారు.. పెంచిన సోమ్ము మీ జేబుల‌లోకే వ‌చ్చిందంటూ పేర్కొన్నారు.

పోలీస్ ప‌హారా మ‌ధ్య కాళేశ్వ‌రం నిర్మాణం
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎవరు చూడకుండా నిర్మాణం చేశార‌ని మండి ప‌డ్డారు రేవంత్ . ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ళను కొంత మంది అధికారులు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయ‌న్నారు . దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింద‌న్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంద‌ని పేర్కొన్నారు. . సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది స్ప‌ష్టం చేశారు. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చాడు.

- Advertisement -

కేసిఆర్ గారూ రండి…మీకూ హెలికాప్ట‌ర్ ఏర్పాటు చేస్తాం..
అలాగే కేసీఆర్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి. మీకు హెలికాప్ట‌ర్ ఏర్పాటు చేస్తాం. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించండని అన్నారు. దీంతో పాటుగా వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..? రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు..! అలాగే సభలో చర్చ పెట్టి కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం అని సీఎం అన్నారు. అనంతరం స్పీకర్ సభను ఈ నెల 14 కు వాయిదా వేశారు. అనంతరం సీఎం ఎమ్మెల్యేలతో కలిసి బస్సులలో కాన్వాయ్ తో మేడిగడ్డ పయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement