Friday, April 26, 2024

Congress – స్థాయిని త‌గ్గించుకుంటున్న రేవంత్ – విహెచ్ సంచ‌ల‌న కామెంట్స్

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ట్లేద‌ని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయ‌కుల వ‌ద్ద‌కు వెళ్లి.. త‌న స్థాయిని దిగజార్చుకుంటున్నార‌ని పేర్కొన్నారు. రేవంత్‌తో చాలా విష‌యాలు మాట్లాడాల‌ని. అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వ‌డం లేద‌న్నారు. త‌క్కువ టైమ్‌లో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్క‌రే అని విహెచ్ పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిపించింది కూడా ఆయ‌నే అని స్ప‌ష్టం చేశారు.

కానీ తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను చూసి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు బాధ‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడ‌ర్‌కు న్యాయం చేయ‌కుండా.. పార్టీలు మారి వ‌స్తున్న‌వారికి రేవంత్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా రెండు సైడ్స్ వినాలని కోరుతున్నాన‌ని అన్నారు. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి అని అంటూ తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాద‌ని హ‌నుమంత‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement