Monday, April 29, 2024

Congress – రాజ‌కీయ పార్టీల‌పైనా, అధికారుల పైనా క‌క్ష సాధింపు మా విధానం కాదు .. మంత్రి పొంగులేటి

అధికారుల మీద , రాజకీయ పార్టీల మీద ఏనాడూ కక్ష్య సాధింపు చర్య‌లుండ‌వ‌న్నారు రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి… త‌మ‌ది ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. మంచి అధికారులకు కీ పొజిషన్ వుంటుందన్నారు. గత ప్రభుత్వం వత్తిడి వల్ల అధికారులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కానీ పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాటిని బయటకు తీస్తామన్నారు. బినామీ కాంట్రాక్ట్ లని వచ్చిన వాటిపై సమీక్ష జరపాలి.. జరుపుతామన్నారు. ఇంకా అధికారం మత్తులో వున్నట్లుగా అహంకారంగా కొంతమంది వున్నారని తెలిపారు.

వారిని ప్రజలు గమనిస్తున్నారని.. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని తెలిపారు పొంగులేటి . బీఆర్ఎస్ మాదిరిగా మాయమాటలు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మేము అలా చేయమని, ఆరు గ్యారెంటీలను సామాన్య ప్రజలకు అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో వున్న మాట వాస్తవమన్నారు. కానీ గారెంటీలను అమలు చేస్తామన్నారు. ఖజానాను ఖాళీ చేసి మాకు ఇచ్చింద‌ని అంటూ . అయిన ఆరు గారింటీ లను ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఊరించదు.. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను సామాన్యులకు ఇచ్చే ఇళ్లను విడతల వారీగా ఇస్తామన్నారు. తెలంగాణలో ఇల్లు లేదు అనే మాట రాకుండా చూస్తామన్నారు. సంక్రాంతి లోపు మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు మంత్రి.

ప్రతిపక్షాలు సహకరించక పోయిన పర్వాలేదని, అయితే . కారు కూతలు కూయవ‌ద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికారు శ్రీనివాస రెడ్డి..త‌మ పరిపాల‌న తీరును కొన్ని నెల‌లు ప‌రిశీలించ‌మ‌ని విప‌క్షాల‌ను కోరారు.. విమ‌ర్శ‌ల‌కు కొద్ది నెలల ఓపిక పట్టండని తెలిపారు. వ్యవస్థ ను, ప్రభుత్వం సొమ్మును దోచుకున్న వారిని ఎవ్వరినీ క్షమించం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎంత పెద్ద నాయకుడు అయిన వదిలిపెట్టబోం అని స్పష్టత ఇచ్చారు. గ్రామ పంచాయతీలో కట్టుకున్న వాటిని రెగ్యులరైజేషన్ కోసం కమిటీ వేస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇంకా డిసిషన్ తీసుకోలేదని అన్నారు. అయిదు గ్రామ పంచాయతీలపై ఆలోచిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి వుందన్నారు. రైతుబంధుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement