Wednesday, May 1, 2024

L & T పై ఉత్త‌మ్ ఫైర్… నాసిర‌కం ప‌నులు చేసినందుకు చర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌..

హైద‌రాబాద్ – కాళేశ్వ‌రం వంటి పెద్ద ప్రాజెక్ట్ మూడేళ్ల‌కు ఎందుకు కుప్ప‌కూలుతున్న‌ద‌ని, ఇలా నాసిరకంగా , ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్ట్ సంస్థపై మండిప‌డ్డారు.. సచివాలయంలో మెడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఎల్.అండ్ టి ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని మండిపడ్డారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని ఉత్తమ్ నిలదీశారు.

ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టబోమని వార్నింగ్‌ ఇచ్చారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement