Tuesday, April 30, 2024

పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే సీత‌క్క

కొత్తగూడ, (ప్రభ న్యూస్) : కొత్తగూడ మండలం గుంజేడు గ్రామపంచాయితీ పరిధిలోని చిట్యాలగడ్డలో దాదాపు 30 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చెయ్యాలన్న ఆలోచనలతో చలికాలంలో చలి తీవ్రత అధికంగా ఉన్నందువల్ల వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి, ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, జడ్పీటీసీ పులుసం పుష్పలత శ్రీనివాస్, కొత్తగూడ సర్పంచ్ మల్లెల రణధీర్, ఎంపీటీసీ భూర్క పుష్పలత నరేందర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, సీనియర్ నాయకులు లావణ్య వెంకన్న, సోలం ఆనంద రావు, తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement