Friday, April 19, 2024

అఖండ‌లో ‘విల‌న్’ .. ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా ..

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి, హీరో బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చి సెన్సేష‌నల్ హిట్ట్ కొట్టిన చిత్రం అఖండ‌. ఈ చిత్రం క‌లెక్ష‌న్ ప‌రంగా కూడా రికార్డ్స్ సృష్టిస్తుంది. కాగా ఈ చిత్రంలో న‌టించిన విల‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. అఖండ‌లో విల‌న్ శ్రీకాంత్ తో పాటు మ‌రో విల‌న్ కూడా ఉన్నాడు. ఆయన పేరు నితిన్ మెహతా.ఈయ‌న ఇంతకుముందు భారత సైన్యంలో 21 సంవత్సరాల పాటు సేవలు అందించి తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. అయితే ఒక ప్రొఫెషనల్ మోడల్ కావాలని.. నటుడిగా ఎదగాలనే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోడానికి గౌరవనీయమైన ఆర్మీ యూనిఫామ్ ను వదులుకున్నాడట‌. ఈ క్రమంలో మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కొన్ని సినిమాల్లో నటించారు. కాకపోతే నటుడిగా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. అయితే ఇప్పుడు ‘అఖండ’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు నితిన్ మెహతా.

నిజానికి ‘అఖండ’ ట్రైలర్ లోనే నితిన్ మెహతా అందరికీ రిజిస్టర్ అయ్యారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరిగా కనిపించడంతో.. బాలయ్య సినిమాలో త్రివిక్రమ్ అంటూ సోషల్ మీడియాలలో మీమ్స్ హల్ చల్ చేశాయి. ఇప్పుడు సినిమా విడుదల తర్వాత ఆయ‌న నటనకు మంచి మార్కులు ప‌డ్డాయి. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నితిన్ కు అవకాశాలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. నితిన్ మెహతా ప్రస్తుత వయసు 48 ఏళ్ళు. ఆర్మీ లో ఉన్నప్పుడు ఎలా ఫిట్ గా ఉండేవారో.. ఇప్పటికీ అదే డైట్ ని మెయింటైన్ చేస్తూ ఫిట్నెస్ మీద దృష్టి సారిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఈ అంకితభావమే అతని మోడలింగ్ కెరీర్ లో ముందుకు సాగడానికి సహాయపడిందట‌. అఖండ విజ‌యంతో ఆయ‌న ఫుల్ జోష్ లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement