Sunday, April 28, 2024

కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ప్రచారంలో భూపతి

హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ తరుపున ఆపార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. వీణవంక మండలంలో ఎల్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ గెలుపు కోసం స్థానిక నాయకులతోకలిసి నియోజకవర్గ సీనియర్ నాయకులు భూపతి రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రచారంలో అడుగడుగునా అధికార పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టి హారతులిస్తున్నారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఎదురొచ్చి వారి కష్టాలను చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భూపతి రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ నేత బండి శ్రీనివాస్ గౌడ్, INTUC జిల్లా అధ్యక్షుడు గూడ ఐలయ్య, ఎంబిఆర్టీం సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Petrol price: సామాన్యుడి జేబుకు చిల్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement