Sunday, April 28, 2024

TS: రైతుల సమస్యల పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

-రైతుల సమస్యల పరిష్కరించే వరకు దీక్షలు చేస్తాం
-ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఎంపీ నామా నాగేశ్వరరావు
పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

వైరా, ఏప్రిల్ 6(ప్రభ న్యూస్): నియోజకవర్గ కేంద్రమైన వైరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ శనివారం ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. రైతు దీక్షలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ దీక్షలో ఎంపి రామ నాగేశ్వరావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందక పంటలు తీవ్రంగా నష్టపోయారని, రైతులు నష్టపోయిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో విఫలమైందని విమర్శించారు. రైతుల సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో జిల్లాలో సాగునీరు, త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉందని, రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే సాగునీరు, తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. హామీలు ఇచ్చి ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కరించేంత వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పార్లమెంటు సభ్యులు వద్దు రాజు రవిచంద్ర మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, మాజీ ఎంపీపీ కట్ట కృష్ణార్జున రావు, మాదినేని ప్రసాద్, చల్ల మోహన్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement