Wednesday, December 6, 2023

Congress Counter – కెసిఆర్ పాలనలో నెంబర్ వన్ తాగుబోతుల అడ్డాగా తెలంగాణ – రేవంత్ రెడ్డి..

న‌ర్సాపూర్ / ప‌ర‌కాల – బంగారు తెలంగాణ చేస్తాన‌న్న కెసిఆర్ రాష్ట్రాన్నితాగుబోతుల అడ్డాగా మార్చార‌ని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.. దేశంలో నెంబ‌ర్ తాగుబోగు స్టేట్ గా చేసిన ఘ‌న‌త కెసిఆర్ దే నంటూ మండిప‌డ్డారు..మెద‌క్ జిల్లా
నర్సాపూర్. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో జ‌రిగిన కాంగ్రెస్ విజ‌య‌భేరి బ‌హిరంగ‌స‌భ‌ల‌లో ఆయ‌న మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఒక నమ్మక ద్రోహికి న‌ర్సాపూర్ లో బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చింద‌ని ఫైర్ అయ్యారు…. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చార‌న్నారు..

- Advertisement -
   

మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్-1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1 …నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు అని ఆయన తెలిపారు. అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు అంటూ ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చారు. .. . ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అంటూ కేసీఆర్ వ్యాఖ్యాల‌ను ఖండించిన రేవంత్ ” తండాల్లో మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం” అని అన్నారు.

“భూమి ఆత్మగౌరవం.. 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం.. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేది. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? .. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని కె సిఆర్ ” ను నిల‌దీశారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement