Saturday, April 27, 2024

Congress Campaign – నేడు మూడు జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు 4 రోజులు ఉండటంతో నాయకులు రాష్ట్రానికి క్యూ కట్టారు.ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అంబంగేట్ సమీపంలో గ్రౌండ్ లో విజయ భేరి బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన కు బోధన్‌లోని సభకు హాజరవుతారు. అనంతరం వేములవాడ, రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తరపున బహిరంగ సభలో ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ మధ్యాహ్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement