Friday, May 3, 2024

పేదింట చదువులతల్లి.. ప్రతిభగల విద్యార్థిణికి అభినందనల వెల్లువ..

తొర్రూరు, (ప్రభ న్యూస్): ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి జాతీయ స్థాయిలో నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థిని ధర్మారపు స్పందనను వారి నివాసంలో బీజేపీ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో శుభాభినందనలు తెలిపి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం ధర్మారపు స్పందన ను చూసి విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదువలేదు అని, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించి సరియైన మార్గములో పయనింప జేస్తే వారి భవిష్యత్తు బంగారు మయం అవుతుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద కుటుంబం నుండి వచ్చి, కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని తను అనుభవించిన కష్టాలను రాబోవుతరాలు అనుభవించకూడదని భారత రాజ్యాంగంలో అల్ప సంఖ్యాక వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించాడనితెలిపారు. అంబేడ్ఖర్ స్పూర్తితో నేటి విద్యార్థులు కష్టపడి చదువుకుని ధేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఎంబీబీఎస్ సీటు సాధించ డంలో అకుంఠిత దీక్షతో క్రృషి చేసిన ధర్మారపు స్పందన తల్లిదండ్రులు చేసిన క్రృషి అభినందననీయమని స్పూర్తి ప్రదాతలుఅని , విద్యా దానం మహాదానమని, వైద్యో నారాయ ణో హరి అని, పేదలకు నాణ్య మైన వైద్యం అందించి ఆదుకో వాలని, పేదల డాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చ మహాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి.రవి బాబు, బీజేపీ ఎస్సీ మోర్చ అర్బన్ అధ్యక్షుడు మంగళ పళ్ళి యాకయ్య, బీజేపీ జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్, రచ్చ కుమార్, బీజెవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్ తదిత రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement