Monday, April 29, 2024

Vemulawada: ఇంటిపేరు తేడాతో అభ్యర్థిలో కలవరం.. కలెక్టర్ జోక్యంతో పరీక్షకు అనుమతి

హాల్ టికెట్ లో ఓ తీరుగా, ఆధార్ కార్డులో మరో తీరుగా ఇంటి పేరు ఉందన్న కారణంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్రంలో గ్రూప్ 4 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రం ముందే ఆపారు అధికారులు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లోపలకు అనుమతించాలని టీపీఎస్సీ ఆదేశించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఓ అభ్యర్థిని లోపలకు అనుమతించ లేదు. హాల్ టికెట్ లో ఉన్న ఇంటి పేరు, ఆధార్ లో ఉన్న ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో అప్పారు. కాలెక్టర్ అనురాగ్ హాయంత్ జోక్యంతో చివర క్షణంలో అనుమతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement