Sunday, May 5, 2024

Minister Damodara: రాష్ట్రంలోని విద్యార్ధులంద‌రికీ ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం .. మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ

అందోల్ః తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హై స్కూళ్లలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి రక్త పరీక్షలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రక్త హీనత తక్కువగా ఉంటే అందుకు కావలసిన ఐరన్ టాబ్లెట్ లు ఇస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ర‌క్త హీన‌త త‌క్కువుగా ఉన్న వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొదటి కార్యక్రమం ఆందోల్ నియోజకవర్గంలో ప్రారంభించామ‌న్నారు. రక్తహీనత తక్కువగా ఉన్న విద్యార్థులు ఐరన్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాల‌ని సూచించారు.

కాగా, ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన స్పందిస్తూ, తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ త‌మ‌ సీఎంని కలవొచ్చు అని తెలిపారు. క‌లిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యలపై మా ప్రభుత్వాన్ని వచ్చి ఎవరు కలిసిన తాము దానికి స్పందిస్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement