Wednesday, May 1, 2024

Service Award : ఉత్తమ సేవలకు విశిష్ట పురస్కారం – ఉత్తమ సింగరేణియన్​గా జీఎం సురేష్

సింగరేణి వ్యాప్తంగా అత్యుత్తమంగా సేవలు అందించే అధికారులకు లభించే అత్యున్నత పురస్కారమైన “ఉత్తమ సింగరేణియన్ అవార్డు” ఈ ఏడాది జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఎం.సురేశ్​ను వరించింది. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఒక్కో అధికారిని ఉత్తమ అధికారిగా.. అలాగే అన్ని ఏరియాల్లో కలిపి అత్యుత్తమ అధికారుల్లో ఒకరిని ఉత్తమ సింగరేణియన్​గా ఎంపిక చేస్తున్నారు.

కాగా, ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎం.సురేశ్​ని అవార్డుల ఎంపిక కమిటీ సిఫార్సు చేసింది. గత 36 ఏండ్లుగా ఆయన కంపెనీకి అందించిన విశిష్ట సేవలను, సమర్థ నాయకత్వ పటిమను గుర్తించి ఉత్తమ సింగరేణియన్గా కమిటీ ఎంపిక చేసింది. 1987లో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా సింగరేణి సంస్థలో చేరిన ఆయన.. తన 36 సంవత్సరాల సర్వీసులో 34 సంవత్సరాలు బొగ్గు గనుల్లోని ఉత్పత్తి విభాగాల్లో పనిచేచేశారు.

ములుగు జిల్లా జంగాలపల్లిలో జన్మించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) స్థాయికి చేరుకున్నారు. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్​గా, సింగరేణి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్​గా ఆయన పని చేసిన ఇల్లందు, రామగుండం 2, శ్రీరాంపూర్ ఏరియాల్లో నూటికి నూరు శాతం పైగా లక్ష్యాలు సాధించారు. రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చి పనిచేసిన నేపథ్యంలో కేకే 5 గని మేనేజర్ గా, కోయగూడెం ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్​గా ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా రెండుసార్లు నేషనల్ సేఫ్టీ అవార్డు అందుకున్నారు. అలాగే అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఏరియా స్థాయిలో గత ఏడాది ఆగస్టు 15న సీఎండీ చేతుల మీదుగా ఉత్తమ అధికారి గానూ అవార్డును అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement