Tuesday, April 30, 2024

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం : పెద్దపల్లి ఏసిపి మహేష్

నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ తెలియజేశారు. ఇవ్వాల (సోమవారం) రామగుండం సిపి రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధంపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి ధృవపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

- Advertisement -

ఏసీపీ పిలుపు మేరకు గ్రామం లోని 25 మంది యువకులు స్వచ్చందంగా రక్త దానం చేయడానికి ముందుకు వచ్చి అంగీకారం తెలపడం జరిగింది. వారిని ఏసీపీ, పోలీస్ అధికారులు అభినందించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ , పెద్దపల్లి ఎస్ఐ మహేందర్, మల్లేష్, ధర్మారం ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement