Saturday, May 4, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ శ‌శాంక‌

కొత్తగూడ, (ప్రభ న్యూస్): కొత్తగూడ మండలంలోని మైలారం తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలులో జాప్యం చేయరాదన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలను కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. ఏయే తరగతులకు ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, వారికి హాస్టల్‌ లో, స్కూల్లో బోధన ఏవిధంగా ఉందని, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో భాగాలేని పరిస్థితులు, అంశాల గురించి అధ్యాపక బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఎదగాలంటే చదువుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. తరువాత తాహసిల్దార్ కార్యాలయంలో ఎఫ్.ఆర్.సి.లో భాగంగా పంచాయితీ కార్యదర్శులు రైతుల భూమి వివరాలను ఎంట్రీ ఎలా చేస్తున్నారో పరిశీలించారు. పనితీరును, సంబంధిత విషయాలపై ఏవైనా ఇబ్బందులున్నాయా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ చందా నరేష్, స్థానిక ఎస్.ఐ.నాగేష్, ఎ.ఓ.జక్కుల ఉదయ్, ఓ.డి.సి.ఎమ్.ఎస్.వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి, ఎ.ఈ.ఓ.లు, హలవత్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement