Wednesday, June 16, 2021

అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీఎంతో కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అధికారులు ఉన్నారు. మరోవైపు సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఇక జిల్లాల్లో మంత్రులు తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News