Saturday, May 4, 2024

Clarify – కట్టే కాలే వరకూ బి ఆర్ ఎస్ లోనే – సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు. ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నాయ‌కులు హ‌స్తం గూటికి చేరారు. మరికొందరు క్యూలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను బీఆర్ఎస్ ను వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు.

కట్టె కాలే వరకు కేసీఆర్‌తోనే..
తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని విమర్శించారు. తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని తెలిపారు. అలాంటి తాను పార్టీ ఎందుకు మారుతానని ప్రశ్నించారు. కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని సత్యవతిరాథోడ్ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement