Friday, May 3, 2024

Exclusive భయపెడుతున్న బ్రెస్ట్​ కేన్సర్ ! కేసుల్లో ముందున్న తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో రొమ్ము కేన్సర్‌కు బలవుతున్న మహిళల్లో తెలంగాణ రాష్ట్రం ముందువరసలో ఉంది. తెలంగాణలోని మహిళలు రొమ్ము కేన్సర్‌కు బలవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. తూర్పు ఈశాన్య రాష్ట్రాల కంటే తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో రొమ్ము కేన్సర్‌ ప్రభావం ఎక్కువగా ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్​) నిర్వహించిన అద్యయనం పేర్కొంది. దేశంలో 2025 నాటికి వ్యాధి తీవ్రత గణనీయంగా పెరుగుతుందని హెచ్చరించింది. మార్చి మొదటి వారంలో చేసిన ఈ అధ్యయనంలో 2012 నుండి 2016 వరకు దేశవ్యాప్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో రొమ్ము కేన్సర్‌ భారిన పడిన వారిపై అధ్యయనం చేశారు.

భారతీయ మహిళల్లో ప్రతి 1,00,000 మందికి 515.4 మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ఐసీఎంఆర్​ అధ్యయనంలో వెల్లడయ్యింది. 2025 నాటికి ఈ సంఖ్య 5.6 మిలియన్‌లకు చేరుతుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఈ వ్యాధి తీవ్రతను నిర్ధారించేందుకు అనారోగ్యం, వైకల్యంతోపాటు ముందుగా మరణించిన వారిని ఆధారంగా తీసుకున్నారు. గ్రామీణ మహిళల కంటే ఎక్కువగా పట్టణ, మెట్రోపాలిత ప్రాంతాల్లో రొమ్ము కేన్సర్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.

- Advertisement -

హైదరాబాద్​ సిటీలో కూడా ఎక్కువే..

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలు రొమ్మ కేన్సర్​ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే మెట్రో నగరాల్లో వారి జీవనశైలి దీనికి కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, తిండిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వైవాహిక జీవితం, ప్రసవంలో ఆలస్యం, తక్కువ తల్లిపాలు కారణంగా పట్టణ ప్రాంతాల్లో రొమ్ము కేన్సర్‌ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. పెద్ద సంఖ్యలో మహిళలు రొమ్ము కేన్సర్‌ భారిన పడటానికి కారణం కేన్సర్‌ గుర్తింపులో ఆలస్యం చేయడమేనని.. ప్రధాన కారణంగా వైద్య నిపుణులు నిర్థారించారు. పరిమిత వనరులు ఆరోగ్య అక్షరాస్యత కారణంగానే ఈ వ్యాధి తీవ్రతను అధ్యయనం చేయడంలో సఫలీకృతం కాలేక పోతున్నట్లు పేర్కొన్నారు. వృత్తిపరమైన పరిస్థితులు, ఆర్థికపరమైన ఒత్తిడి కారణంగా రొమ్ము కేన్సర్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ కేన్సర్‌ నివారణా మార్గంగా వ్యాధిని ముందస్తుగా గుర్తించడమే సరైన చికిత్స అని ఈ అధ్యయనం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement