Tuesday, May 7, 2024

చాక‌లి ఐల‌మ్మ కు ఘ‌న నివాళి….

ఎల్బీ న‌గ‌ర్ – తెలంగాణ వీరవణిత,సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు, చాకలి ఐలమ్మ ఐక్యవేదిక ఎల్బీనగర్ నియోజకవర్గం కన్వీనర్ బాతరాజు నరసింహ, మరియు కర్మన్ ఘట్ హనుమన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమా రెడ్డి ,మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ ,ధర్మకర్తలు ముద్ద కళ్యాణ్,మధుసాగర్ మరియు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement