Thursday, October 10, 2024

మ‌హిళా శ‌క్తికి ప్రతిక చాక‌లి ఐల‌మ్మ – మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్ – భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పీడన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వీరనారి చాక‌లి ఐల‌మ్మ 38వ వ‌ర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి మంత్రి ఘనంగా నివాలులర్పించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి చాక‌లి ఐల‌మ్మ ప్రతీక అని. ఐలమ్మ చూపిన తెగువ సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చిందని, సాయుధ ఉధ్యమ స‌మ‌యంలో ఐల‌మ్మ చూపిన ధైర్య సాహ‌సాలు ఎన‌లేనివని గుర్తు చేశారు. తెలంగాణ aపౌరుషాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.తెలంగాణ పోరాట యోధుల‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమున్నత రీతిలో స్మరించుకుంటుందన్నారు. స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, మ‌హిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు,జిల్లా కలెక్టర్ డాః బి. గోపి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డిఓ కె. మహేశ్వర్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మధు,మాజీ ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణ్ రావు జిల్లా బీసీ సంక్షేమ అధికారి, తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్, సిపిఐ(ఎం) మిల్కూరి వాసుదేవ రెడ్డి, రజక సంఘ నాయకులు కే శ్రీనివాస్, పెండ్యాల ప్రశాంత్, పూసాల శ్రీకాంత్, బిజిగిరి నవీన్, రాచకొండ రాజు, ఇతర పార్టీల ప్రముఖులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement