Tuesday, April 30, 2024

టీడీపీ నిరాహార దీక్షలు …. కీల‌క‌నేత‌లు హౌజ్ అరెస్ట్

శ్రీకాకుళం, సెప్టెంబర్ 10:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పలుచోట్ల నిరాహార దీక్ష కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాహారదీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరో పక్క శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని ఆమె స్వగృహంలో పోలీసులు ఆదివారం ఉదయం నుంచి నిర్బంధించారు. జిల్లాలో పలుచోట్ల టిడిపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోకుని ఆయన స్వగృహంలో నిర్బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement