Friday, December 1, 2023

TS: కారు బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

ములుగు జిల్లా : కారు డివైడర్, స్ట్రీట్ లైట్లను ఢీకొట్టి బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు ఇవాళ తెల్లవారుజామున వరంగల్ వైపు వస్తుండగా జంగాలపల్లి క్రాస్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు స్విఫ్ట్ డిజైర్ ఒకసారి అదుపుతప్పి పశువుల సంత ముందు అదుపుతప్పి పక్కనున్న డివైడర్, స్ట్రీట్ లైట్లు ఢీ కొట్టి పల్టీ కొట్టింది.

- Advertisement -
   

ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న ములుగు సిఐ, ఎస్ఐలు క్షతగాత్రులను 108 ద్వారా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో అతివేగం ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement