Friday, December 1, 2023

KNR: కాలేజీ బస్సును ఢీకొన్న డీసీఎం.. తప్పిన పెను ప్రమాదం..

తిమ్మాపూర్ ప్రభ న్యూస్.. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండల కేంద్రంలోని తిమ్మాపూర్ స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ స్టేజీ వద్ద డివైడర్ దాటుతున్న శ్రీ చైతన్య కాలేజీ బస్సును హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా ఢీకొంది.

- Advertisement -
   

కరీంనగర్ నుండి తిమ్మాపూర్ ఇంజనీరింగ్ కళాశాలకు విద్యార్థులను చేర్చే క్రమంలో హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ కాలేజీ బస్సును ఢీకొనడంతో కొంతవరకు బస్సు డ్యామేజ్ అయింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఎస్ఐ ప్రమోద్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement