Sunday, May 5, 2024

పంజాబ్ లో కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు..

హనుమకొండ, (ప్రభ న్యూస్‌): అప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం.. ఇప్పుడు తెలంగాణ రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు పోరాటం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హనుమకొండ చౌరస్తా నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం (ఏకశిలా పార్క్) వరకు ఎడ్ల బండ్ల ర్యాలీ తీశారు. ధర్నాలో మంత్రి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

బీజేపీ పార్టీ ఇప్పుడు ఒక బ్రష్ఠాచారీ జనత పార్టీ గా మారింది అని. ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా తీర్చిదిద్దే లా కృషి చేస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ను భవిష్యత్ లో కొనమని ఖరాకండిగా చెప్తున్నారని. దక్షిణాదిలో పండే పంటలలో వరి సాగుకు తెలంగాణ రాష్ట్రం అనువైనదని. ఎఫ్.సి.ఐ ధాన్యం కొనను అని రాష్ట్రానికి హుకుం జారీ చేస్తోందన్నారు. పంజాబ్ రాష్ట్రంలో పండె పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు కొనడం లేదు అని. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు కొనవలసిన భాద్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement